బడిలో ఉగ్రవాదుల దాడి.. 16 మంది చిన్నారుల మృతి..

- November 30, 2022 , by Maagulf
బడిలో ఉగ్రవాదుల దాడి.. 16 మంది చిన్నారుల మృతి..

అఫ్గానిస్థాన్‌: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఓ బడిలో బాంబు దాడికి పాల్పడి 10 మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర అఫ్గానిస్థాన్ లోని అయ్‌బాక్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాలిబన్ సర్కారు అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే, మతపర అంశాలు బోధించే ఆ బడిలో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.

ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశంలో తాలిబన్ల పాలన మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అఫ్గాన్ లో పదే పదే దాడులు జరుగుతున్నాయి.

ఆకలి కేకలు, తాలిబన్ల ఆంక్షలు, స్వేచ్ఛ లేకపోవడం, ఉపాధి కరవవడంతో పాటు మరోవైపు ఉగ్రవాదులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమ పంతాన్ని నెరవేర్చుకోవడానికి చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుని పలు ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులకు తెగబడుతూ కలకలం రేపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com