500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిరిండియా
- December 12, 2022
న్యూ ఢిల్లీ: ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ దాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. దీని కోసం భారీ సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనుంది. సుమారు 500ల జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిది. రూ.80 వేల కోట్లను ఖర్చుతో బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది.
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు కాగా..మరో 100 విమానాలు భారీ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్ బస్ కు చెందిన A350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ భారీ కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి. ఈ కొనుగోలుకు సంబంధించి ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం







