మొరాకో అభిమానుల కోసం 30 అదనపు విమానాలు

- December 13, 2022 , by Maagulf
మొరాకో అభిమానుల కోసం 30 అదనపు విమానాలు

రబాత్: ఫ్రాన్స్‌తో బుధవారం జరిగే చారిత్రాత్మక ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం మొరాకో జాతీయ విమానయాన సంస్థ ఖతార్ కు 30 అదనపు విమానాలను నడుపనున్నట్లు తెలిపింది.

"ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో జాతీయ జట్టుకు మద్దతు ఇవ్వాలనుకునే చాలా మంది మొరాకోకులను ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ కోసం ఖతార్ వెళ్లేందుకు రాయల్ ఎయిర్ మారోక్ కాసాబ్లాంకా, దోహా మధ్య ఎయిర్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసింది" అని ఆ సంస్థ ప్రకటించింది.

మొరాకో శనివారం క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్‌ను 1-0తో ఓడించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి ఆఫ్రికన్ లేదా అరబ్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com