మైనస్ 8 డిగ్రీల చలిలో మెగాస్టార్.! ఉత్సాహం ఆపుకోలేకపోతున్నా.!
- December 15, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’ సంక్రాంతికి రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా టీమ్ ప్రాన్స్‌లో ఓ సాంగ్ షూట్ కోసం వెళ్లింది.
ఫ్యాన్స్‌లోని మంచు కొండల్లో శృతి హాసన్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ ఈ నెల 12న షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సాంగ్ అవుట్ పుట్ చాలా బాగుందట.
ఫ్రాన్స్‌లోని మంచు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లను కవర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్‌కి సంబంధించిన చిన్న బిట్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఓ సరదా పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
మైనస్ 8 డిగ్రీల చలిలో ఈ సాంగ్ కోసం స్టెప్పులేయడానికి చాలా చాలా కష్టపడ్డా. కానీ, ఆ కష్టమంతా మీ కోసం చేసింది కాబట్టి చాలా ఇష్టంగా వుంది. సాంగ్‌లో కవర్ చేసిన లొకేషన్లు అద్భుతంగా వచ్చాయ్. సినిమాకి ఈ సాంగ్ మెయిన్ అస్సెట్ అవుతుంది.. అంటూ, ఫ్రాన్స్‌లోని బ్యూటిఫుల్ మంచు వాతావరణాన్ని ఓ వీడియో రూపంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉత్సాహం ఆపుకోలేకే ఈ వీడియో, దాంతో పాటూ చిన్న సాంగ్ బిట్ కూడా రిలీజ్ చేసేశా.. ఎవ్వరికీ చెప్పొద్దు ప్లీజ్.! అంటూ తనదైన శైలిలో చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







