వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల పై ఫోకస్..
- December 18, 2022
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతికత, అధిక వేగంతోపాటు అద్భుత సౌకర్యాలతో ప్రయాణికులకు తమ ప్రయాణంలో మంచి అనుభూతినిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచి, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 2023 కేంద్ర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 300 నుంచి 400 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది. అందుకనుగుణంగా రైల్వే సంస్థ 160 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లే 475 రైళ్లను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టిల్టింగ్ అనే ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తోంది. తద్వారా ట్రాక్ వంపుల్లోనూ రైలు అధిక వేగంతో సులభంగా ప్రయాణించేందుకు వీలు కల్గుంతుంది.
500 వందే భారత్ రైళ్లు..
వచ్చే కొన్ని ఏళ్లలో 500 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేసేందుకు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఒక నెలలో రెండు నుంచి రెండున్నర రైళ్లను తయారు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి.. త్వరలో నెలలో ఆరు రైళ్లను సిద్ధం చేసేలా ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు వెల్లడించారు. అలాగే పార్లమెంట్లో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆర్థిక సంవత్సరంలో ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
వందే భారత్ రూట్ల వివరాలు..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు 2019 తన తొలి ప్రయాణాన్ని వారణాసి, ఢిల్లీ.. ఢిల్లీ, కాత్రా మధ్య ప్రారంభించింది. 2022లో అప్ గ్రేడేడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలును ఐసీఎఫ్ చెన్నై ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ నాలుగు అప్ గ్రేడేడ్ ర్యాక్ లు వినియోగంలో ఉన్నాయి.
1. 20825/20826 బిలాస్‌పూర్ జంక్షన్ – నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
2. 20607/20608 చెన్నై సెంట్రల్- మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
3. 22447/22448 న్యూ ఢిల్లీ – అంబ్ అందౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
4. 20901/2090 ముంబై సెంట్రల్ గాంధీనగర్ ఎక్స్‌ప్రెస్ కాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
5. 22439/22440 న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
6. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







