ఏపీలోని మహిళలకు శుభవార్త..
- December 18, 2022
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 20న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ATC Tires AP Pvt Ltd, Anatalaxmi Spinning Pvt Ltd సంస్థల్లో ఖాళీల (Jobs) భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 250 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ATC Tires AP Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్/క్వాలిటీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, టెక్నికల్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనం ఉంటుంది. వయస్సు 21-24 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Anatalaxmi Spinning Pvt Ltd: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. 5వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లా బోయపాలెం లో అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.8100 వేతనం ఉంటుంది. 19-30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
Registration Link https://t.co/zwCEz9QEXb Contact: 6303889174, 9666472877, 9059641596 APSSDC Helpline - 9988853335 pic.twitter.com/hsppqoHZds — AP Skill Development (@AP_Skill) December 18, 2022
వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు SKR Degree College (Women), రాజమహేంద్రవరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
- ఇతర వివరాలకు 6303889174, 9666472877 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







