ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023:వన్డే వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్..
- December 18, 2022
ముంబై: షెడ్యూల్ ప్రకారం, 2023 అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ ఇండియాలో స్టార్ట్ కావాలి.కానీ మన దేశంలో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణ విషయమై ఇప్పటికే బీసీసీఐ, ఐసీసీ మధ్య వివాదం ప్రారంభమైంది.అలాగే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌తో కూడా బీసీసీఐకి భేదాభిప్రాయాలు వచ్చాయి.
వచ్చే ఏడాది క్రికెట్ కి సంబంధించి ఈ రెండు మెగా టోర్నీలు జరగాల్సి ఉంది.వీటిలో ఒకటైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇక ఇంకో మెగా టోర్నీకి ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది.అయితే, పాక్‌లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము ఆడమని ఇండియా తరఫున బీసీసీఐ స్పష్టం చేసింది.
దీనికి బదులుగా తాము ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నుంచి వాకౌట్ అవుతామని పాక్ హెచ్చరికలు జారీ చేసింది.అయితే ఏ టీం ఏ ట్రోఫీ నుంచి తప్పుకున్న నిర్వహణ బోర్డులకు, ఐసీసీకి చిక్కులు తప్పవు.
అందుకే ఈ అంశంపై బీసీసీఐతో ఏసీసీ, ఐసీసీ చర్చలు కొనసాగిస్తోంది.ఈ చర్చలు సఫలమై వివాదం పరిష్కారం అవుతే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహించడం కుదురుతుంది.మరోవైపు పన్నుల అంశం కూడా టోర్నీ నిర్వహణకు సమస్యగా మారింది.మరవైపు భారతదేశంలో ఐసీసీ పన్ను చెల్లించుకోవాల్సిన అవసరం కూడా వస్తోంది.
పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ ఐసీసీ బీసీసీఐని కోరింది కానీ ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని బీసీసీఐ వెల్లడించింది.పన్ను కట్టకూడదనుకుంటే ఇండియాలో కాకుండా వేరే దేశంలో టోర్నీ నిర్వహించుకోవచ్చని బీసీసీఐ ఐసీసీకి కూడా తెలిపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







