జెడ్డాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు రావాలి

- December 23, 2022 , by Maagulf
జెడ్డాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు రావాలి

జెడ్డా: జెడ్డా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని జెడ్డాలోని స్థానిక అధికారులు హెచ్చరించారు. జెడ్డాలో ఉరుములు, భారీ వర్షాలు పడతాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) హెచ్చరించింది. ఈ సమయంలో ఉపరితల గాలులు, వడగళ్లతో పాటు, అధిక అలలు, కుండపోత వర్షంతో పాటు దృశ్యమానత లోపం కూడా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. NCM హెచ్చరికల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి వెళ్లకూడదని నివాసితులకు మక్కా ఎమిరేట్‌లోని విపత్తు నిర్వహణ కేంద్రం సూచించింది. వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 3,822 మంది ఉద్యోగులు, 1,490 పరికరాలు వివిధ ప్రదేశాలలో సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com