సాల్మియాలో ఐదు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం
- December 25, 2022
కువైట్: సాల్మియాలో ఐదు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ (కేఎఫ్ఎఫ్) తెలిపింది. ప్రమాద సమాచారం అందగానే సెంట్రల్ కమాండ్ అడ్మినిస్ట్రేషన్ సాల్మియా, బిడా అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు కేఎఫ్ఎఫ్ పేర్కొంది. ఐదు అంతస్తుల భవనంలో మంటలు మూడవ అంతస్తులో ప్రారంభమైనట్లు ఫైర్ సిబ్బంది గుర్తించి.. భవనంలోని వ్యక్తులను బయటకు తీసి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఊపరిరాడక అపస్మారక స్థితికి చేరడంతో అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







