దుబాయ్‌లో పలు రోడ్లు మూసివేత, మెట్రో సమయం పొడిగింపు

- December 30, 2022 , by Maagulf
దుబాయ్‌లో పలు రోడ్లు మూసివేత, మెట్రో సమయం పొడిగింపు

యూఏఈ: నూతన సంవత్సర వేడుకల సన్నాహాల నేపథ్యంలో పలు రహదారులను మూసివేయనున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ వెల్లడించింది. బుర్జ్ ఖలీఫా స్టేషన్ సాయంత్రం 05:00 గంటల నుండి మూసివేయబడుతుందని మెట్రో రైడర్లు గమనించాలని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ బహ్రోజియాన్ తెలిపారు.

• షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ పార్కింగ్ ఏరియాను సాయంత్రం 04:00 గంటలకు మూసివేయనున్నారు. బౌలెవార్డ్ ప్రాంతంలో లేదా దుబాయ్ మాల్‌లో రిజర్వేషన్లు కలిగి ఉన్నవారు శనివారం సాయంత్రం 04:00 గంటలలోపు చేరుకోవాల్సి ఉంటుంది.

• ఫైనాన్షియల్ సెంటర్ రోడ్‌లోని దిగువ డెక్ సాయంత్రం 04:00 గంటలకు మూసివేయబడుతుంది. అల్ సుకూక్ స్ట్రీట్ రాత్రి 8:00 గంటలకు మూసివేయబడుతుంది. ఔద్ మేథా రోడ్ నుండి బుర్జ్ ఖలీఫా జిల్లాకు వెళ్లే అల్ అసయెల్ రోడ్డును పబ్లిక్ బస్సులు, అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

• ఈవెంట్ జరుగుతున్న సమయంలో అల్ ముస్తక్బాల్ స్ట్రీట్ క్రమంగా 2వ జబీల్ రోడ్, అల్ మైదాన్ రోడ్ మధ్య సాయంత్రం 04:00 గంటల నుంచి మూసివేత  ప్రారంభమవుతుంది.

43 గంటలపాటు మెట్రో పరుగులు

దుబాయ్ మెట్రో ఎరుపు, ఆకుపచ్చ లైన్లు శనివారం 12/31/2022 ఉదయం 5:00 గంటల నుండి పనిచేస్తాయని బహ్రోజియాన్ ధృవీకరించారు. తద్వారా మెట్రో 02/01/2023 సోమవారం ఉదయం 12 గంటల వరకు 43 గంటలపాటు నిరంతరంగా పని చేస్తుందన్నారు. 12/31/2022 శనివారం ఉదయం 6:00 నుండి 01/02/2023కి అనుగుణంగా సోమవారం తెల్లవారుజామున 1:00 గంటల వరకు ట్రామ్, ఈవెంట్ ప్రాంతానికి.. షోలు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com