మద్యం పై 30% పన్ను తొలగింపు.. వ్యక్తిగత లైసెన్స్ ఉచితం
- January 02, 2023
దుబాయ్: ఆల్కహాల్ పానీయాలపై 30 శాతం మునిసిపాలిటీ పన్నును అలాగే వ్యక్తిగత మద్యం లైసెన్స్ ఫీజును దుబాయ్ నిలిపివేసింది. జనవరి 1, 2023 నుండి దుబాయ్‌లో మద్య పానీయాలను చట్టబద్ధంగా కొనుగోలు చేయడానికి అర్హులైన వారికి వ్యక్తిగత మద్యం లైసెన్స్‌లు ఉచితంగా లభిస్తాయని పేర్కొంది. యూఏఈలో చట్టబద్ధంగా తాగడానికి వ్యక్తికి కనీసం 21 ఏళ్లు ఉండాలి. మద్యం అమ్మకాలపై 30 శాతం మునిసిపాలిటీ పన్నును తొలగిస్తున్నట్లు దుబాయ్ ప్రభుత్వం ప్రకటనను చేయడంపై మారిటైమ్, మర్కంటైల్ ఇంటర్నేషనల్ (MMI) & ఎమిరేట్స్ లీజర్ రిటైల్ గ్రూప్ సీఈఓ టైరోన్ రీడ్ హర్షం వ్యక్తం చేశారు. జనవరి 1 నుండి తమ 21 స్టోర్లలోని ఈ మేరకు ధరలను తగ్గిస్తామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







