ఏడు శిఖరాలను అధిరోహించిన మొదటి ఒమానీగా నబీ రికార్డు
- January 02, 2023
ఒమన్: ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించిన మొదటి వ్యక్తిగా ఒమానీ సాహసికుడు సులేమాన్ బిన్ హమూద్ అల్ నబీ రికార్డులు సృష్టించారు. ఎవరెస్ట్, అకాన్కాగువా, డెనాలి, కిలిమంజారో, ఎల్బ్రస్, కోస్కియుస్కో, విన్సన్ శిఖరాలను అధిరోహించిన మొదటి ఒమానీగా నబీ నిలిచాడు. 2022 డిసెంబర్ 24న నబీ సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్ పర్వతాన్ని ఎక్కి దక్షిణ ధ్రువానికి చేరుకున్నాడు. డిసెంబర్ 2న తన సాహసయాత్రను ప్రారంభించిన నబీ, 120 కిలోమీటర్ల దూరం స్కీయింగ్ చేసి డిసెంబర్ 16న దక్షిణ ధృవానికి చేరుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 24న మౌంట్ విన్సన్ క్యాంప్‌ను అధిరోహించి ఒమన్ సుల్తానేట్ జెండాను, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ చిత్రాన్ని ప్రదర్శించి యాత్రను పూర్తి చేసినట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలు -60 డిగ్రీలకు చేరుకోవడం, బలమైన గాలులు ఎముకలను చల్లబరిచాయని యాత్రలో ఎదురైన సవాళ్ల గురించి నబీ వివరించారు. బలమైన గాలులతో అకస్మాత్తుగా హిమపాతం కారణంగా దృష్టి లోపం తలెత్తి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడం సవాలుగా మారిందన్నారు. 30 కిలోల కంటే ఎక్కువ ఉన్న తన బ్యాక్‌ప్యాక్ బరువు మొత్తం యాత్రను మరింత సవాలుగా మార్చిందని అతను తెలిపారు. ఒమన్ ప్రేమ, శాంతి దేశం అని ప్రపంచానికి సందేశం పంపడానికి తాను ఉత్తర ధృవానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఒమానీ యువత అన్ని రంగాలలో రాణించగల, గొప్ప విజయాలను నమోదు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అతను చెప్పారు. ఏడు శిఖరాలతో పాటు ఆల్ప్స్, పశ్చిమ ఐరోపాలో ఎత్తైన పర్వతమైన ఫ్రాన్స్‌లోని 4,807.81 మీటర్ల మౌంట్ బ్లాంక్‌ను కూడా నబీ అధిగమించాడు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







