మెక్సికో విమానాశ్రయం: సూట్ కేసులో మనుషుల పుర్రెలు గుర్తింపు

- January 03, 2023 , by Maagulf
మెక్సికో విమానాశ్రయం: సూట్ కేసులో మనుషుల పుర్రెలు గుర్తింపు

మెక్సికో: మెక్సికో విమానాశ్రయంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో విమానాశ్రయంలో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.

కొరియర్ బాక్సుల్లో వచ్చిన సూట్ కేసులను చెకింగ్ మిషన్ల సాయంతో అధికారులు తనిఖీ చేస్తుండగా అందులో మానవుల పుర్రెలు ఉన్నట్లు ఎక్స్ రే మిషన్ గుర్తించింది. దీంతో అధికారులు ఆ సూట్ కేసును తెరిచి చూస్తే అందులో నాలుగు మనిషి పుర్రెలు కనపించాయి.

సంబంధిత పత్రాల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్ నుంచి దక్షిణ కరోలినాకు పుర్రెలను కొరియర్ చేస్తున్నట్లు గుర్తించారు. కొరియర్ బాక్సుల్లో మనుషుల పుర్రెలు రావడంపై విమానాశ్రయం అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com