బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త సిములేషన్ సిస్టమ్
- January 17, 2023
మనామా: అత్యంత ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కోసం కొత్త సిములేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు బహ్రెయిన్ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సరికొత్త డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ వద్ద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ల కోసం కొత్త సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ సిమ్యులేషన్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుందని పేర్కొంది. హైటెక్ వ్యవస్థ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలను 360 డిగ్రీల విస్తృత పరిధిలో పరిశీలించేందుకు అనుమతిస్తుందని తెలిపింది. కొత్త వ్యవస్థ రేడియో కమ్యూనికేషన్లు, గ్రౌండ్ ట్రాఫిక్ రాడార్, వాతావరణ సమాచారం, విమానాశ్రయం మైదానంలో ఎయిర్ ట్రాఫిక్‌ను నిర్వహించడానికి ఉపయోగించే ఇతర అధునాతన పరికరాలను సూచించడానికి వర్చువల్ సిస్టమ్‌లకు మద్దతుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మహ్మద్ బిన్ థామెర్ అల్ కాబి మాట్లాడుతూ.. ఎయిర్ కంట్రోలర్లు కొత్త సిములేషన్ వ్యవస్థపై శిక్షణను ప్రారంభించామన్నారు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాస్తవ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కార్యకలాపాల మెరుగుకు కొత్త వ్యవస్థ దోహదం చేస్తుందన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌లకు బాహ్య శిక్షణకు సంబంధించిన ఖర్చులను తగ్గించడంతో పాటు విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణలో అత్యుత్తమ అభ్యాసాల ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







