ట్విటర్ హాండిల్లో పేరు మార్చిన కేటీఆర్
- January 25, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్..తన ట్విట్టర్ హాండిల్లో పేరు మార్చుకున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో KTRTRS నుంచి KTRBRS గా మార్చారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న హోదాను ప్రొఫైల్ నుంచి తొలగించారు. పురపాలక, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు హోదా మాత్రమే ప్రొఫైల్‌లో పెట్టుకున్నారు.
ఇక మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ పధకాలను , పనులను , అభివృద్ధిని ప్రజలకు చేరవేయడమే కాదు..ఎవరు ఏ ఆపదలో ఉన్న సరే సోషల్ మీడియా ద్వారా తనవద్దకు వస్తే ఏ క్షణమైన వారిని ఆదుకుంటుంటారు. అది రాత్రా, పగల అనేది కూడా చూడరు. అప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి వారిని ఆదుకుంటారు. ఇలా ఎన్నోసార్లు ఎంతమందికి చేసి వార్తల్లో నిలిచారు కేటీఆర్.
రీసెంట్ గా కేటీఆర్ దావోస్ పర్యటన కు వెళ్లి కొన్ని వందల కోట్లు తెలంగాణ కు తీసుకొచ్చారు. దీనిపట్ల ప్రతి ఒక్కరు ప్రశంసిస్తూ..అందరు కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







