AM 2 PM సర్వీస్ ప్రారంభించిన TSRTC..
- January 27, 2023
హైదరాబాద్: వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ (AM 2 PM) పేరుతో నూతనంగా ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో ఈ సేవల్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికుల టికెట్ ఆదాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, లాజిస్టిక్‌తో పాటు స్వచ్ఛమైన జీవా వాటర్ బాటిళ్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చామని ఎండీ సజ్జనర్ తెలిపారు. లాజిస్టిక్స్(కార్గో) సేవల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని, ఆ సేవలను వినియోగదారులకు మరింత వేగంగా, సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో ‘AM 2 PM’ సర్వీస్‌ను ప్రారంభించామన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సజ్జనార్ చెప్పారు.
‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందని అన్నారు. ఈ సర్వీస్ పరిధిలోకి ఒక కేజీ పార్శిళ్లే వస్తాయని, వాటి విలువ రూ.5 వేలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కొరియర్ ధర రూ.99గా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. నగదు, యూపీఐ పేమెంట్స్ రూపంలో ఈ సేవలను పొందవవచ్చని వివరించారు. త్వరలోనే AM 2 PM ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. 5 కిలోల లోపు పార్శిళ్లను తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ, తదితర నగరాలకు చేరవేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్







