తిరుచ్చి విమానాశ్రయంలో 10,000 డాలర్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

- January 29, 2023 , by Maagulf
తిరుచ్చి విమానాశ్రయంలో 10,000 డాలర్ల విదేశీ కరెన్సీ స్వాధీనం

యూఏఈ: భారతదేశంలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రయాణికుడి లోదుస్తులలో దాచిన 10,000 డాలర్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) జనవరి 28న అనుమానంతో విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. లోదుస్తులలో దాచిన $10,000(రూ.805,500) ను గుర్తించినట్లు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్‌లో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) ఒక వ్యక్తిని అడ్డగించి టిన్‌లో దాచిపెట్టిన రెండు బంగారు బిస్కెట్‌లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 147.5 గ్రాములు ఉంటుందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. అలాగే నవంబర్ 2022 లోనూ తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణికురాలి నుండి సుమారు 145 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com