ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన సౌదీ యువరాజు, ఫ్రెంచ్ మంత్రి కేథరీన్
- February 02, 2023
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. ఫ్రెంచ్ యూరప్ - విదేశీ వ్యవహారాల మంత్రి కేథరీన్ కొలోనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో సౌదీ, ఫ్రాన్స్ సీనియర్ అధికారులు హాజరయ్యారు. కొలన్నా తన అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రియాద్‌కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖురైజీ స్వాగతం పలికారు. కొలోనా పర్యటన సౌదీ, ఫ్రాన్స్ మధ్య విశిష్ట సహకారాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారిస్తుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!