ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన సౌదీ యువరాజు, ఫ్రెంచ్ మంత్రి కేథరీన్

- February 02, 2023 , by Maagulf
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన సౌదీ యువరాజు, ఫ్రెంచ్ మంత్రి కేథరీన్

రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్.. ఫ్రెంచ్ యూరప్ - విదేశీ వ్యవహారాల మంత్రి కేథరీన్ కొలోనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో సౌదీ, ఫ్రాన్స్ సీనియర్ అధికారులు హాజరయ్యారు. కొలన్నా తన అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం రియాద్‌కు చేరుకున్నారు. కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖురైజీ స్వాగతం పలికారు. కొలోనా పర్యటన సౌదీ, ఫ్రాన్స్ మధ్య విశిష్ట సహకారాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారిస్తుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com