2022లో 100 మంది బాలబాలికలపై విచారణ

- February 02, 2023 , by Maagulf
2022లో 100 మంది బాలబాలికలపై విచారణ

యూఏఈ: గత ఏడాది కాలంలో 116 జువైనల్ కేసులను డీల్ చేసినట్లు యూఏఈ ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫర్ జువెనైల్స్ తెలిపింది. ఇది 2021లో 137 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 15 శాతం తగ్గింది.ఇందులో ఎక్కువ మంది టీనేజర్లు ఉన్నారు.దాడులు, తగాదాలు, ట్రాఫిక్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత సాధారణ నేరాలు ఎక్కువగా ఉన్నాయి. ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తమ వెబ్‌సైట్‌లో ఇటీవలి సంవత్సరాలలో నేరాలకు పాల్పడే యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2019లో 208 మందితో పోలిస్తే 2020లో 175 మంది బాలబాలికలు ప్రాసిక్యూట్ చేసినట్లు తెలిపారు. 2018లో నేరాలకు పాల్పడిన యువకుల సంఖ్య 313గా ఉందన్నారు. భద్రతా అధికారులు, పాఠశాలలు, తల్లిదండ్రులు ఇతర సంస్థలు చేసిన ప్రయత్నాల వల్ల నేరాలలో పాల్గొనే యువకుల సంఖ్య తగ్గిందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.UAE అంతటా పోలీసులు తరచుగా యువతకు డ్రగ్స్, లైసెన్స్ లేని డ్రైవింగ్  ఇతర నేరాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన అవగాహన ప్రచారాలతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. 

యూఏఈ జువెనైల్ చట్టంలోని ఆర్టికల్ 6 ఏడు సంవత్సరాల వయస్సు పూర్తికాని బాల నేరస్థులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించబడదని పేర్కొంది. అయితే, న్యాయస్థానం లేదా సమర్థ అధికారులు అవసరమైతే, తగిన విద్యా లేదా చికిత్సా చర్యలు తీసుకోవాలని ఆదేశించవచ్చు.ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాల నేరస్థులపై ఆంక్షలు న్యాయమూర్తికి వదిలివేయబడతాయి.  16 ఏళ్లు పైబడి ఉంటే, న్యాయమూర్తి చట్టం ప్రకారం తీర్పు ఇస్తారు.అయితే, బాల నేరస్థులకు ఉరిశిక్ష విధించరు. అలాగే పెద్దల జైలుకు పంపరు.శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 10 ప్రకారం పెద్దలకు మరణశిక్ష లేదా జైలు శిక్ష విధించబడే సందర్భాలలో మైనర్లు గరిష్టంగా 10 సంవత్సరాల నిర్బంధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.  సామాజిక సంరక్షణ, విద్యను అందించే ప్రదేశాలలో బాలనేరస్థులను నిర్బంధించాలని చట్టం నిర్దేశిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com