మెంతులతో సౌందర్యం.! ఇది విన్నారా.?
- February 07, 2023
మెంతులు.. వంటింటి దినుసుల్లో ఓ ముఖ్యమైన దినుసు. కాస్త చేదుగా వుండే ఈ మెంతులు వంటలకు మంచి రుచినిస్తుంటాయ్. వంటలకు రుచిని అందించడమే కాదండోయ్. ఆరోగ్యానికీ, చర్మ సౌందర్యానికీ ఎంతో మేలు చేస్తుంటాయ్.
చర్మం మీద ముడతలు పోగొట్టే శక్తి మెంతులకు చాలా ఎక్కువగా వున్నట్లు అధ్యయనాల్లో తెలిసింది. మెంతులు మరిగించిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, వయసుతో పాటూ వచ్చే ముడతల్ని నివారించుకోవచ్చునట.
మెంతుల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా వుంటాయ్. ఇవి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏదో ఒక రకంగా మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అలాగే చుండ్రు సమస్యను నివారించడంలో మెంతులు చాలా శక్తివంతంగా పని చేస్తాయట. రాత్రి నీళ్లలో నానబెట్టిన మెంతుల్ని తెల్లారి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసి తలకు పట్టిస్తే, చుండ్రుతో పాటూ, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







