శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు విడుదల: TTD
- February 07, 2023
తిరుమల: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపు(బుధవారం) రిలీజ్ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఈ నెల 8 నుంచి ఈ టికెట్లకు రిజిస్ట్రేషన్ ను ప్రారంభిస్తామని తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించి శుక్రవారం (10వ తేదీ) ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామని వివరించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల 22 నుంచి 28 తేదీ వరకు ఆయా సేవల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని వివరించింది.
స్వామి వారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను ఈ నెల 9 న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. టిటిడి అధికారిక వెబ్ సైట్ (https://ttdsevaonline.com) ద్వారా ఈ సేవలకు సంబంధించిన దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది. కాగా, మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 8 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







