600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించిన ఇన్ఫోసిస్
- February 07, 2023
న్యూ ఢిల్లీ: కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు భారతీయ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ షాక్ ఇచ్చింది.దాదాపు 600 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగంలోంచి తొలగించింది. సంస్థ నిర్వహించిన ఇంటర్నల్ టెస్టుల్లో ఫెయిలవ్వడం వల్లే ఉద్యోగుల్ని ఇన్ఫోసిస్ తొలగించినట్లు తెలుస్తోంది. కారణం ఏదైతేనేం.. టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరింది. ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్‌గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మంది ఫ్రెషర్స్‌ను ఇన్ఫోసిస్ తొలగించింది. వీరిలో 208 మందిని రెండు వారాలక్రితమే తొలగించింది. అయితే, గత ఏడాది జూలైకి ముందు బెంగళూరులో నియమించుకున్న ఫ్రెషర్స్‌ను మాత్రం తొలగించలేదని సమాచారం. ఆ తర్వాత నియామకమైన వారిని మాత్రమే కంపెనీ తొలగించింది.
ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిలైన వారిని తొలగించడం నిరంతరం జరిగే ప్రక్రియే అని చెప్పారు. ఇన్ఫోసిస్ సంస్థకు ముందు మరో టెక్ సంస్థ విప్రో కూడా ఇలాగే ఉద్యోగుల్ని తొలగించింది. విప్రో సంస్థ కూడా ఇదే పద్ధతిలో ఇటీవల 450 మంది ఫ్రెషర్స్‌ను తొలగించింది. ఇటీవల కాలంలో టెక్ సంస్థలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య లక్షకుపైగానే ఉంటుందని ఒక అంచనా.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







