తిరుమలలో భక్తుల రద్దీ..
- February 19, 2023
తిరుమల: మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. తిరుమలలోని 24 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 22 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
నిన్న (శనివారం) 71,350 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 28,912 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.47 కోట్లు వచ్చిందని వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి తిరుపతిలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గురుమూర్తి, కంకణ బట్టర్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ ఇన్ స్పెక్టర్ కిరణ్ కూమార్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







