జీవితా రాజశేఖర్ ‘సూపర్’ రీ ఎంట్రీ .!
- March 02, 2023
సినియర్ నటి జీవితా రాజశేఖర్ చాలా కాలం తర్వాత ముఖానికి రంగేసుకోబోతున్నారు. అప్పుడెప్పుడో ‘తలంబ్రాలు’, ‘జానకి రాముడు’, ‘మగాడు’ తదితర సినిమాల్లో నటించిన జీవితా రాజశేఖర్, వివాహానంతరం సినిమాలకు దూరమయ్యారు.
దర్శకత్వం మీద ఆసక్తితో దర్శకురాలిగా మారి పలు చిత్రాలను తెరకెక్కించారు. నిర్మాతగానూ రాణిస్తున్నారు. అయితే, తాజాగా ఓ తమిళ సినిమా కోసం జీవిత మళ్లీ నటనలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించబడింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన తనయ సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జీవిత రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకి ‘లాల్ సలాం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతేడాది స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









