మహిళా కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం
- March 02, 2023బహ్రెయిన్: హూరాలోని దార్ అల్ షిఫా మెడికల్ సెంటర్లో తక్కువ-ఆదాయ వర్గ మహిళా కార్మికుల కోసం ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, SGPT (లివర్ టెస్ట్), బ్లడ్ ప్రెజర్, బీఎంఐ(BMI), ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, డెంటల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మెగామార్ట్, ఆసుపత్రి అల్పాహారాన్ని అందించి మద్దతుగా నిలిచాయి. అనంతరం మహిళా కార్మికులకు వివిధ రాయితీలు ఇచ్చే లాయల్టీ కార్డ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, శ్రీలంక, నేపాల్, బహ్రెయిన్, ఇండియా, బంగ్లాదేశ్, ఇథియోపియా వంటి వివిధ దేశాల నుండి రిసెప్షనిస్ట్లు, క్యాషియర్లు, క్లీనర్లు, క్లీనింగ్ సిబ్బంది సహా 120 మంది మహిళా గృహ సహాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై గత రెండు రోజులుగా రేడియో మిర్చి 104.2 FM కి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..