ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీయార్.!
- March 06, 2023
గత కొన్ని రోజులుగా అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా రామ్ చరణ్ అమెరికా వెళ్లాడు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ తెలుగు సినిమా గొప్పతనం గురించి చాటి చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12న జరగబోయే ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలోనూ చరణ్ పాల్గొనబోతున్నాడు.
ఇదే విషయమై ఎన్టీయార్, చరణ్ అభిమానుల మధ్య చిచ్చు చినుకులా మొదలై గాలి వానలా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక, ఈ గాలివానను చల్లార్చేందుకు ఎన్టీయార్ సంసిద్ధమయ్యాడు. ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీయార్కీ ఓ అవార్డు వుందని సంబంధిత శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీయార్ అమెరికాకు బయలుదేరాడు. తారకరత్నకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసిన ఎన్టీయార్, అమెరికాకు ప్రయాణం కట్టాడు. సో.. ఇక్కడితోనైనా చరణ్, ఎన్టీయార్ మధ్య అభిమానుల పేరుతో బలవంతంగా పెట్టేసిన చిచ్చుకు చెక్ పడుతుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









