మెగా హీరో కోసం ఆ మాలీవుడ్ హీరో విలన్గా.!
- March 18, 2023టాలీవుడ్లో మలయాళ హీరోల హవా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా మలయాళ ప్రముఖ హీరోలు, తెలుగులో విలన్లుగా వర్ధిల్లుతున్నారు. టాలీవుడ్ హీరోలకు ధీటైన విలన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఫహాద్ పాజిల్ ‘పుష్ప’లో విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కోసం ఓ మలయాళ నటుడు తెలుగు ప్రేక్షకులకు విలన్గా పరిచయం కాబోతున్నాడు. ఆయన మరెవరో కాదు, జోజూ జార్జ్. ‘ఇరాట్టా’ సినిమాతో ఇటీవలే ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడీయన. ఇక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో విలన్గా మరింత దగ్గర కానున్నాడన్న మాట.
శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు