ఆ డైరెక్టర్‌కి రష్మిక హ్యాట్రిక్ ఇస్తుందా.?
- March 25, 2023‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది కన్నడ కస్తూరి రష్మికా మండన్నా. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకి రష్మిక లక్కీ ఛామ్ అయ్యింది.
దాంతో ఆ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమాలోనూ వెనకా ముందూ ఆలోచించకుండా రష్మికనే హీరోయిన్గా తీసుకున్నాడు. మళ్లీ హిట్ కొట్టాడు.
ఇక, ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాకీ తన లక్కీ ఛామ్ రష్మికనే హీరోయిన్గా తీసుకున్నాడు. ‘భీష్మ’ కాంబోనే మళ్లీ సెట్ చేసుకున్నాడు వెంకీ కుడుముల. ఉగాది సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగింది.
కాగా, ఈ సినిమాపై నితిన్ కాస్త ఎక్కువ టెన్షన్ ఫీలవుతున్నాడట. ఎందుకంటే, ‘భీష్మ’ స్థాయి సూపర్ హిట్ కోరుకుంటున్నాడట నితిన్. రీసెంట్గా నితిన్ నుంచి వచ్చిన ‘మాచర్ల నియోజక వర్గం’ డిజాస్టర్‌ని మిగిల్చింది.
సో, రాబోయే ఈ తాజా చిత్రం ఎలాగైనా హిట్ లిస్టులో పడాలనుకుంటున్నాడట. చూడాలి మరి, అటు డైరెక్టర్ వెంకీకీ, ఇటు నితిన్‌కీ కూడా ఈ ప్రాజెక్ట్ ఓ ఛాలెంజే అని చెప్పొచ్చేమో.. రష్మిక కారణంగా.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్