2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!

- April 03, 2023 , by Maagulf
2023 చివరికి చమురు ఉత్పత్తిని 500k బ్యారెళ్లు తగ్గించనున్న సౌదీ..!

రియాద్: సౌదీ అరేబియా మే నుండి 2023 చివరి వరకు రోజుకు 500 వేల బ్యారెళ్ల స్వచ్ఛంద కోతను అమలు చేయనున్నట్లు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. కొన్ని ఓపెక్(OPEC), నాన్-ఓపెక్ భాగస్వామ్య దేశాలతో కుదిరిన సమన్వయం కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 అక్టోబరు 5న జరిగిన 33వ ఓపెక్ , నాన్- ఓపెక్ మంత్రుల సమావేశంలో ఉత్పత్తిని తగ్గించడానికి ఈ స్వచ్ఛంద కోత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చమురు మార్కెట్ స్థిరత్వానికి తోడ్పడే లక్ష్యంతో చేపట్టిన ముందుజాగ్రత్త చర్య ఇదని మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com