డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన పాకిస్థాన్ వ్యక్తికి జీవితఖైదు
- April 03, 2023
బహ్రెయిన్: తన కడుపులో 100 హెరాయిన్ నింపిన క్యాప్సూల్స్‌ను దాచి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఒక పాకిస్థాన్ వ్యక్తికి బహ్రెయిన్‌లో జీవితఖైదు పడింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అనుమానంతో పాకిస్థానీ వ్యక్తిని తనిఖీ చేయగా.. డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. డ్రగ్ క్యాప్సూల్స్‌ను వెలికితీసేందుకు సదరు పాకిస్థాన్ వ్యక్తిని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌కు తరలించారు. అనంతరం చేపట్టిన విచారణలో బహ్రెయిన్ లో ఉన్న అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ఆ వ్యక్తికి సంబంధం ఉందని వెల్లడైందని బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. కేసును విచారించిన కోర్టు.. నిందితుడికి జీవితఖైదుతోపాటు BD10,000 జరిమానా కూడా విధించింది.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







