ఉమ్మ్ రామూల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 15, 2023
దుబాయ్: దుబాయ్‌లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఉమ్మ్ రామూల్‌లో మంటలు చెలరేగిన ప్రదేశం నుండి నలుపురంగు పొగలు రావడాన్ని గమనించినట్లు స్థానికులు వెల్లడించారు. నివేదికల ప్రకారం.. క్లీనింగ్ మెటీరియల్‌ని కలిగి ఉన్న గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. ససమాచారం అందగానే స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర విభాగం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి.. మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4.55 గంటలకు జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను నివాసితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. క్షణాల్లో అవి వైరల్ అయ్యాయి.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







