ఇ-కన్సల్ట్ ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

- April 20, 2023 , by Maagulf
ఇ-కన్సల్ట్ ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్

హైదరాబాద్: ప్రఖ్యాత హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన మెడికవర్ హాస్పిటల్స్  E-హెల్త్,  E-కన్సల్టేషన్–డిజిహెల్త్ సర్వీసెస్ ను ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించటం కోసం ఈ సర్వీసెస్ ను ప్రాంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సర్వీస్ డెలివరీని డిజిటలైజ్ చేయడం ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవల డెలివరీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరత్‌రెడ్డి విచ్చేసి ఈ  ప్రాజెక్టుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ, “MEDICOVER హాస్పిటల్స్ ఈ యొక్క ఆరోగ్య సంరక్షణ సాంకేతికత యొక్క శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా రోగులు ఇప్పుడు వారి ఇళ్లలో లేదా ఎక్కడి నుండైనా ఇ-ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మెరుగైన చికిత్సను పొందవచ్చు, తద్వారా వారికీ ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా , అనుభవజ్ఞులైన డాక్టర్స్ సేవలను  సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, వత్తిడి వల్ల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద అవసరం. సరైన సమయంలో సరైన వైద్యం అందక చాలా మరణాలు సంభవిస్తున్నాయి మరియు తక్కువ ఖర్చు త్వరగా కోలుకునేవాళ్లు కూడా సరైన వైద్యం, సరైన స్పెషాలిటీ  డాక్టర్స్ కి  చూపించుకోలేకపోవడం ,చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల సరైన సమయంలో వైద్యం అందలేకపోతున్నారు.ఈ అవాంతరాలు అన్నింటిని అధిగమించి మెరుగైన సేవలను వారి వద్దకే అందించటానికి మెడికవర్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక సంరక్షణను పొందడంలో గతంలో సవాళ్లను ఎదుర్కొన్న మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సత్వర వైద్య సేవలను అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అనంతరం చీఫ్ అఫ్ బిజినెస్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ ఈ-కన్సల్టేషన్ నెట్‌వర్క్ కింద ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ రూమ్‌లు మరియు గేటెడ్ కమ్యూనిటీల ప్రాంగణాల్లో స్పోక్ సెంటర్లు ఉంటాయి. శిక్షణ పొందిన వైద్య/పారామెడికల్ సిబ్బందితో ప్రతి ఒక్కరికి నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి అనే లక్యంతో ప్రాంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కైలాసం, డాక్టర్ శ్రీనివాస్ జూలూరి,డాక్టర్ కమల్ కిరణ్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కృష్ణ కిరణ్, డాక్టర్ ప్రతాప్ వర్మ, సెంటర్ హెడ్ మాత ప్రసాద్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com