సౌదీ అరేబియాలో మెట్ పల్లి పట్టణ వాసి మృతి

- May 16, 2023 , by Maagulf
సౌదీ అరేబియాలో మెట్ పల్లి  పట్టణ వాసి మృతి

సౌదీ అరేబియా: తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మెట్పల్లి పట్టణానికి చెందిన మార్గం విజయ్,(36) సౌదీ అరేబియా అలహాస ప్రాంతంలో మరణించాడు.చిన్న వయసులో తండ్రిని కోల్పోయి అనాధగా మారిన దీక్షిత,అక్షిత. ఉన్న అప్పులు కట్టుకోవడానికి జీవితం సరిపోయింది, ఇంకా 10 లక్షలు అప్పు ఉంది. కుటుంబ పోషణ కోసం, బిడ్డలను గొప్పగా చదివించాలని, ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లడం జరిగింది. తాను పనిచేస్తున్న కంపెనీ లోనే తిరుపతి రాచకొండ, వైజాగ్ రాజు, మరియు ఫరూక్ మరియు అబ్దుల్ రఫీక్, చిన్న అంజయ్య, మారుతి మార్గం, పెరిక రాజేందర్, లక్ష్మీనారాయణ గౌడ్, మరియు ఇండియన్ ఎంబసీ కు చెందిన ముయోద్దీన్ రెహమతుల్లా సహకారంతో మృతదేహాన్ని ఇంటికి చేర్చడం జరిగింది. విమానాశ్రయం నుంచి మృతదేహాన్ని ఇంటికి చేర్చడానికి బడుగు లక్ష్మణ్ ఎన్నారై చిన్నారి డిపార్ట్మెంట్ చిట్టిబాబు సహకారంతో ఉచిత అంబులెన్స్ సమకూర్చడం జరిగింది. గల్ఫ్ లో చనిపోయిన నిరుపేద గల్ఫ్ కార్మికుడు మృతదేహాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు తక్షణ సహాయం అందించాలని,గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్ల నిధులతో ఎన్నారై పాలసీ అమలు చేసే విధంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కృషి చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ సభ్యులు విన్నపం తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com