కబ్ద్‌లో కొత్త అంబులెన్స్ కేంద్రం
- May 17, 2023
కువైట్: కబ్ద్ - B ప్రాంతంలో కొత్త అంబులెన్స్ కేంద్రాన్ని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంబులెన్స్‌తో కూడిన కేంద్రం కబ్ద్, ఫర్వానియా గుర్రపుస్వారీ శిబిరాలు, అగ్నిమాపక శిక్షణ పాఠశాల, స్కౌట్ క్యాంపు ప్రాంతాలకు సేవ చేయడానికి 24 గంటలూ పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మెడికల్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ అల్-షట్టి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ఫర్వానియా ఆరోగ్య జిల్లాలో ఎనిమిదో అంబులెన్స్ సెంటర్ అని, దేశంలో 77వది అని తెలిపారు. వెస్ట్ అబ్దుల్లా ముబారక్ సమీపంలోని యూనివర్సిటీ సిటీ అంబులెన్స్ సెంటర్ వంటి ప్రదేశాలతో సహా మంత్రిత్వ శాఖ తెరవడానికి ప్లాన్ చేస్తున్న కేంద్రాల శ్రేణిలో ఈ కేంద్రం భాగమన్నారు. త్వరలోనే అహ్మదీ హెల్త్ ఏరియాలో మరో మూడు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..