అల్లు శిరీష్ కొత్త ప్రయోగం.! వర్కవుట్ అయ్యేనా.?
- May 30, 2023అన్న అల్లు అర్జున్ బాటలోనే తాను కూడా హీరోగా తెరంగేట్రం చేశాడు అల్లు శిరీష్. హీరోగా అల్లు వారబ్బాయ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావస్తున్నా.. తనకంటూ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు.
బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు రావడంతో కొన్నాళ్లు యాక్టింగ్ నుంచి తప్పుకున్నాడు. నిర్మాణంపై ఫోకస్ పెట్టాలనుకున్నాడు. కానీ, మళ్లీ వచ్చాడు.
‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించిన శిరీష్‌కి అది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ, బలవంతంగా ఈ సినిమాతో హిట్టు అనిపించేసుకున్నాడంతే.
ఇక, ఇప్పుడు ఇంకో ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సారి ఓ టెడ్డీ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు అల్లు శిరీష్. అందుకు సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
ఇదే తన నుంచి రాబోయే కొత్త ప్రాజెక్ట్ అని అయితే హింట్ ఇచ్చాడు కానీ, ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ.! త్వరలోనే పూర్తి వివరాలతో మళ్లీ వస్తా.. అని ప్రకటించాడు. చూడాలి మరి, అల్లు వారబ్బాయ్ ఈ సరికొత్త ప్రయోగాన్ని ఎలా వర్కవుట్ చేస్తాడో.!
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..