లావణ్య త్రిపాఠి ఇకపై సినిమాలు మానేస్తుందా.?
- June 28, 2023
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని మెగా కోడలైపోయింది లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన లావణ్య త్రిపాఠి కెరీర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేకపోయినప్పటికీ ఓ మోస్తరుగా కెరీర్ నడిపించుకుంటూ వచ్చేసింది.
ఈ మధ్య దాదాపుగా లావణ్య కెరీర్ అటకెక్కేసిందన్న వార్తలు వినిపించాయ్. వినిపించడమేంటీ.? వాస్తవమే కూడా. ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌తో వచ్చింది కానీ, అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
అయితే, మెగా కోడలనే ట్యాగ్ దక్కించుకున్నాకా, లావణ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయిందట. ఆపర్లు క్యూ కడుతున్నాయట. రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తోందట.
అంతా బాగానే వుంది కానీ, అసలింతకీ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా.? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కాజల్, సమంత తదితర ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్నారు. వారి కోవలోనే లావణ్య కూడా పయనిస్తుందా.? లేక గ్యాప్ తీసుకుంటుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..