గురూజీని ఇంప్రెస్ చేసిన సుశాంత్ హీరోయిన్.!
- June 28, 2023
గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అభయం పొందితే అంతే. అది నెరవేరినట్లే. మీనాక్షి చౌదరి విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. మీనాక్షి తొలి చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమాతోనే గురూజీని ఇంప్రెస్ చేసేసిందట మీనాక్షి చౌదరి.
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ గెస్ట్‌గా విచ్చేసిన సంగతి గుర్తుండే వుంటుంది. అప్పుడే మీనాక్షిపై ఓ కన్నేసి వుంచారట గురూజీ. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ, ఇక ఇప్పుడు ఆ టైమొచ్చేసింది ‘గుంటూరు కారం’ సినిమాతో
పూజా హెగ్ధే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగానే, సంయుక్త పేరు మొదట ప్రచారంలోకి వచ్చింది కానీ, ముందే గురూజీ ఫిక్స్ అయిపోయారట ఆ ప్లేస్‌లో మీనాక్షిని రిజర్వ్ చేయాలని.
అదే జరిగిందంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, మీనాక్షి సైలెంట్‌గా షూటింగ్‌లో పాల్గొంటోందనీ అంటున్నారు. ఈ సస్పెన్స్ ఇలా ఇంకొన్నాళ్లు కొనసాగితే, సినిమా హైప్‌కి అది కాస్త యూజ్ అవుతుందని అనుకుంటున్నారు కాబోలు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్..