భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలి: రాచకొండ సిపి డిఎస్ చౌహన్
- June 28, 2023
హైదరాబాద్: భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ అన్నారు.ఇటీవల గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ అవరణలోని SATS షూటింగ్ రేంజ్ లో నిర్వహించబడిన తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ షూటింగ్ లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని ఐటీ & కమ్యూనికేషన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఎ. ప్రసన్న కుమార్, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించారు. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు నెరేడ్ మెట్ కమిషనరేట్ లోని కమిషనర్ కార్యాలయంలో సీపీ డిఎస్ చౌహాన్ విజేత అయిన ప్రసన్న కుమార్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరపున అన్ని రకాల తోడ్పాటు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..