‘దేవర’ కోసం ఆ రిస్క్ చేస్తాడా ఎన్టీయార్.?

- June 28, 2023 , by Maagulf
‘దేవర’ కోసం ఆ రిస్క్ చేస్తాడా ఎన్టీయార్.?

ఎన్టీయార్‌కి ‘దేవర’ చాలా చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా చాలా కష్టపడుతున్నాడు ఎన్టీయార్.
అన్ని విషయాల్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడట. కొరటాలపై పూర్తి నమ్మకం వుంచకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ, సెకండ్ ఓపీనియన్స్ కూడా తీసుకుంటున్నాడట. 
దాంతో, ‘దేవర’ అవుట్ పుట్ బాగా వస్తోందని ఇన్‌సైడ్ టాక్. అంతా బాగానే వుంది కానీ, ‘దేవర’ను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారా.? అంటే, ఓ వర్గం అవునంటోంది. ఎన్టీయార్ సన్నిహిత వర్గం కాదంటోంది.
ఎందుకంటే, రెండు పార్టులుగా తెరకెక్కిస్తే, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అదే ఒక్క పార్ట్ అయితే, కంప్లీట్ కాన్‌సన్‌ట్రేషన్ ఈ పార్టుపైనే వుంచొచ్చు అనేది ఎన్టీయార్ అభిప్రాయమనీ ఆయన సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం.
అయితే, ‘దేవర’ హిట్ అయితే, కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్‌లాంటిదేమైనా ప్లాన్ చేయొచ్చు.. అనుకుంటున్నారట. ఏది ఏమైనా ‘దేవర’ రిజల్ట్ మీదే అంతా బేస్ అయ్యుంది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com