అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్

- July 08, 2023 , by Maagulf
అధికారిక పత్రాలు ఫోర్జరీ.. 33మంది ఫిలిప్పీన్స్ ముఠా అరెస్ట్

కువైట్: దేశంలోని ఫిలిప్పీన్స్ కమ్యూనిటీ కోసం అధికారిక పత్రాలను ఫోర్జరీ చేస్తున్న ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్ట్ చేసింది. దేశంలోని చట్టాలను ఉల్లంఘించేవారిని అరికట్టడానికి డిప్యూటీ ప్రధాని,  అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మార్గదర్శకాల మేరకు ఫోర్జరీ ముఠాను పట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమ్యూనిటీ సభ్యుల కోసం స్టడీ సర్టిఫికెట్లు, వివాహ ఒప్పందాలు,  డ్రైవింగ్ పర్మిట్‌లు వంటి మోసపూరిత పత్రాలను జారీ చేసిన 33 మంది ఫిలిపినోలను పట్టుకోవడంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం సహకారం అందించాయని పేర్కొన్నారు. వారిపై తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com