నిధి అగర్వాల్ ఆ ఛాన్స్ భలే కొట్టేసిందే.!
- July 18, 2023
పవన్ కల్యాణ్ సరసన నటించాలన్నది ప్రతీ హీరోయిన్ కోరిక. స్టార్ హీరోయిన్లకే అది సాధ్యమవుతుందా.? అంటే ఏమో కొన్ని సమయాల్లో అదృష్టం కలిసొచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్సొచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా దక్కించేసుకోవచ్చు.
శృతి హాసన్‌లాంటి ముద్దుగుమ్మలు ఈ లిస్టులోనే చేరతారు. ఇప్పుడు అలాంటి ఛాన్సేగా నిధి అగర్వాల్‌ని వరించింది ‘హరి హరవీరమల్లు’తో. నిజానికి నిధి అగర్వాల్‌కి ఇంత వరకూ స్టార్ స్టేటస్ దక్కిందే లేదు. కానీ, ‘హరి హరవీరమల్లు’లో అవకాశం దక్కించేసుకుంది. నిజమే ఇది ఆమెకి గోల్డెన్ ఛాన్సే.
అందుకే ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ ఇన్‌స్టా పోస్ట్‌లో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియో (తొలి పోస్ట్) ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తాను ఇండస్ర్టీలోని పలువురు సినీ నటీనటులతో దిగిన ఫోటోలతో ఎడిట్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో నిది అగర్వాల్కీ చోటు దక్కడం విశేసం. అదే విషయాన్ని ఆమె ప్రస్థావిస్తూ ఇంతకన్నా ఓ హీరోయిన్‌కి కావల్సిన భాగ్యమేముంటుంది.! అని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నిధి అగర్వాల్ పోస్ట్ చేసింది. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హరవీరమల్లు’ తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!