రివర్స్ యాక్షన్‌తో ఆసక్తి రేపుతోన్న ‘హిడింబ’ ట్రైలర్.!
- July 18, 2023
‘రాజుగారి గది’ సినిమా సిరీస్‌లతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశ్విన్ బాబు. యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్ సోదరుడిగా ఫిలిం ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు. ‘రాజుగారి గది’ మొదటి సిరీస్ బాగా వర్కవుట్ అయ్యింది. కానీ, ఆ తర్వాత అశ్విన్ బాబు నటించిన సినిమాలేమీ పెద్దగా వర్కవుట్ కాలేదు.
తాజాగా ‘హిడింబ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అశ్విన్. నందితా శ్వేత ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అతి త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘హిడింబ’ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చాలా డిఫరెంట్‌గా కట్ చేశారు. అంతా రివర్స్ యాక్షన్‌లో ట్రైలర్ కట్ చేశారు. అంతకు ముందు రిలీజైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా వున్నాయ్. ఇక లేటెస్ట్గా వచ్చిన ట్రైలర్‌తో ‘హిడింబ’ ఒక ప్రత్యేకమైన చిత్రమని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. సీరియస్ టోన్‌లో అశ్విన్ కనిపిస్తున్నాడు. హీరోయిన్ రోల్ కూడా పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది.
ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని డిఫరెంట్ జోనర్ మూవీ ‘హిడింబ’ అని చెబుతున్నారు. అనిల్ కన్నెగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ జోనర్.? కథేంటీ.? అనేది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!