ఉష్ణోగ్రతలు పెరగడంతో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం
- July 18, 2023
కువైట్: కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగడంతో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఫలితంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ లోడ్ ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రికల్ లోడ్ మెజర్మెంట్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 16,370 మెగావాట్ల వినియోగ రేటుకు చేరుకుంది. గత ఏడాది అత్యధిక లోడ్ అయిన 16,180 మెగావాట్లను అధిగమించింది. సమాచార మూలాల ప్రకారం.. ప్రస్తుత వినియోగ రేట్ల పెరుగుదలకు 49 - 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే మండే ఉష్ణోగ్రతలు కారణమని విద్యుత్ రంగ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







