ఉష్ణోగ్రతలు పెరగడంతో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

- July 18, 2023 , by Maagulf
ఉష్ణోగ్రతలు పెరగడంతో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

కువైట్:  కువైట్ లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగడంతో విద్యుత్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఫలితంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక విద్యుత్ లోడ్ ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రికల్ లోడ్ మెజర్‌మెంట్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 16,370 మెగావాట్ల వినియోగ రేటుకు చేరుకుంది. గత ఏడాది అత్యధిక లోడ్ అయిన 16,180 మెగావాట్లను అధిగమించింది. సమాచార మూలాల ప్రకారం.. ప్రస్తుత వినియోగ రేట్ల పెరుగుదలకు 49 - 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే మండే ఉష్ణోగ్రతలు కారణమని విద్యుత్ రంగ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com