జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!

- June 24, 2015 , by Maagulf
జెబెల్ అలీ గురుద్వారాలో పవిత్ర ఖురాన్ పఠనం!

"దయచేసి రమదాన్ దినాలలో లoగరు (ప్రసాదం) పార్సిల్ ను అడగవద్దు" - అని సూచించే ఇంగ్లీషు మరియు గురుముఖి(పంజాబీ) భాషలలో ఉన్న విజ్ఞాపన, మసీదు ముందు కాక గురుద్వారా ముందు చూసి ఇకపై ఆశ్చర్యపోవద్దు! దుబాయి, జెబెల్ అలీ లోనున్న గురుద్వారాలో వరుసగా రెండవ సంవత్సరం కూడా రమదాన్ పాటింపబడుతున్న సత్సాంప్రదాయంలో, ఈ సంవత్సరం జులై 22 ఇఫ్తార్ నాటి ప్రత్యేక సందర్భానికి గౌరవ అతిధులుగా, ప్రముఖ ఇస్లాం వక్త - అహ్మద్ హమిద్, అల్ మానార్ సెంటర్ ప్రతినిధి అబ్దుల్ హాదీ రానున్నారు.

ఈ విషయమై హమిద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ దైవoపై నమ్మకాన్ని పంచి ఇవ్వడానికి ఇదే ఉత్తమ సమయమని బోధించారు. ఈ కార్యక్రమానికి 20 మంది ఇతర ముస్లిం మిత్రులను, మూడు చర్చిల సభ్యులను, క్రిస్టియన్లను కూడా ఆహ్వానించిన గురునానక్ దర్బార్ యొక్క ఛైర్మన్ శ్రీ సురిందర్ సింగ్ కాంధారీ, దేవునికి తమనుతాము అర్పించుకోవడం గురించిన హమీద్ గారి ప్రసంగాన్ని ప్రశంసించారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com