24 గంటల్లో 70 మంది ప్రవాసులపై ట్రావెల్ బ్యాన్
- August 21, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేయడానికి ముందు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 24 గంటల్లో 70 మంది ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ చలానాలు చెల్లించని కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించనట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుంచి ట్రాఫిక్ జరిమానాగా మొత్తం 66,000 దినార్లను సేకరించినట్లు తెలిపింది. ట్రావెల్ బ్యాన్ విధించిన వారిలో 50 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. దేశం విడిచి వెళ్లే ప్రవాసులందరూ ట్రాఫిక్ ఉల్లంఘనలను సమీక్షించుకోవాలని, ప్రయాణంలో ఎలాంటి జాప్యాన్ని నివారించడానికి ముందుగానే క్లియర్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









