7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు

- August 22, 2023 , by Maagulf
7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు

లండన్: ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన 7 మంది శిశువులను చంపిన నర్సుకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్స్ లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపినందుకు తన జీవితాంతం జైలుశిక్ష అనుభవించాలని సోమవారం బ్రిటన్‌లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ గోస్ తీర్పు ఇచ్చారు. 33 ఏళ్ల లెట్బీ, 2015 నుండి 13 నెలల పాటు ఉత్తర ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లోని నియోనాటల్ యూనిట్‌లో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలను హత్య చేసింది. శిశువులకు ఇన్సులిన్ లేదా గాలితో ఇంజెక్ట్ చేసి వారు చనిపోయేలా చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com