అజ్మాన్‌లోని సిటీ ఫెలాష్ స్టోర్‌లో అగ్నిప్రమాదం

- August 23, 2023 , by Maagulf
అజ్మాన్‌లోని సిటీ ఫెలాష్ స్టోర్‌లో అగ్నిప్రమాదం

యూఏఈ: అల్ జుర్ఫ్ ప్రాంతంలోని అజ్మాన్ చైనా మాల్ ఎదురుగా ఉన్న సిటీ ఫెలాష్ స్టోర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చెలరేగిన మంటలను అజ్మాన్ సివిల్ డిఫెన్స్‌లోని అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించి ఆర్పివేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ డిపార్టుమెంట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com