‘నా సామిరంగా..’ అంటోన్న నాగార్జున.!
- August 29, 2023
కొత్త దర్శకులను పరిచయం చేయడంలో అక్కినేని నాగార్జున ముందుంటారు. చాలా కాలంగా అక్కినేని నాగార్జున నుంచి కొత్త ప్రాజెక్టులేమీ అనౌన్స్ కాలేదు.
తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాని ప్రకటించారు. విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు.
‘నా సామిరంగా’ అనే టైటిల్‌తో పాటూ, ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు తాజాగా మేకర్లు. లుంగీ కట్టి, నోట్లో బిడీ పెట్టి పక్కా మాస్ అవతార్‌లోకి మారిపోయాడు ఈ సినిమా కోసం నాగార్జున.
ఈ మధ్య ఏ సినిమా చేసినా నాగార్జునకు పెద్దగా కలిసి రావడం లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టలేకపోయాడు నాగార్జున.
‘ నా సామిరంగా..’ అనే మాస్ టైటిల్‌తో మాస్ గెటప్‌లో ఈ సారైనా నాగార్జున టార్గెట్ రీచ్ అవుతాడేమో చూడాలి మరి. అన్నట్లు ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ ప్యాన్ ఇండియా సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







